విద్యార్థులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్

75చూసినవారు
విద్యార్థులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్
టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్, ఇంటర్నేషనల్ రూట్లలో ట్రావెల్ చేసే విద్యార్థులకు టికెట్ ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్‌తో పాటు 10 కిలోల వరకు అదనపు లగేజి తీసుకెళ్లడానికి అవకాశమిచ్చింది. ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌, మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్స్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు.

సంబంధిత పోస్ట్