AP: రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. తులసిబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.