పోలీస్‌స్టేషన్‌కు పెద్దారెడ్డి.. తాడిపత్రిలో హైటెన్షన్

1573చూసినవారు
పోలీస్‌స్టేషన్‌కు పెద్దారెడ్డి.. తాడిపత్రిలో హైటెన్షన్
మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకోవడంతో శనివారం నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. TDP నేత సూర్యమునిపై దాడి, పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయిన పెద్దారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ష్యూరిటీలు సమర్పించేందుకు పెద్దారెడ్డి నేరుగా తాడిపత్రి పీఎస్‌కు వెళ్లారు. షూరిటీలు సమర్పించిన తర్వాత ఆయన సంతకం చేసి వెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్