తెలంగాణలో బతుకమ్మ, దసరా అతిపెద్ద పండుగలు కావడంతో నగరాలు, పట్టణాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు ఈ పండక్కి సొంతూళ్ల బాట పడతారు. దీన్ని ఆసరా చేసుకొని ప్రజారవాణా సంస్థ ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతోంది. గత ఏడాది, అంతకు ముందు సంవత్సరాల్లో దసరా పండక్కి సొంతూళ్లకు సాధారణ ఛార్జీలతోనే వెళ్లి వచ్చిన ప్రజల నుంచి ఆర్టీసీ ఈసారి అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. దసరాకు నడుపుతున్న ప్రత్యేక సర్వీసుల టికెట్ బేసిక్ ధరలో 50 శాతం పెంచేశారు. దీంతో ఛార్జీలు భారీగా పెరిగాయి.