నేను చెబితే చంద్రబాబు చెప్పినట్లే: ఎమ్మెల్యే పార్థసారథి

72చూసినవారు
నేను చెబితే చంద్రబాబు చెప్పినట్లే: ఎమ్మెల్యే పార్థసారథి
AP: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాను చెబితే డిప్యూటీ సీఎం పవన్, సీఎం చంద్రబాబు చెప్పినట్లేనని కర్నూలులో నిర్వహించిన కూటమి కార్యకర్తల సమావేశంలో అన్నారు. 'వైసీపీకి చెందిన వారు ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మిల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులు వదిలేసి వెళ్లాలన్నారు. వైసీపీ వాళ్లు ఐదేళ్లుగా చేసుకున్నది చాలు. ఇక మా కార్యకర్తలకు అప్పగించండి. నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్' అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్