ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జి. నరేందర్‌

60చూసినవారు
ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జి. నరేందర్‌
ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జి.నరేందర్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న ఆయనను సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సుతో పదోన్నతిపై ఉత్తరాఖండ్‌ హైకోర్టు సీజేగా నియమించడం జరిగింది. జస్టిస్‌ జి.నరేందర్‌ 2023 అక్టోబరులో బదిలీపై కర్ణాటక హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు వచ్చారు. ఏపీ హైకోర్టు జడ్జీల సీనియార్టీలో ఆయన రెండో స్థానంలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్