అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. సభ్యసమాజం తలదించుకునేలా అన్న వరసయ్యే వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు. ఎనిమిది నెలలుగా చిన్నారిపై అత్యాచారం చేస్తూ ఆ దుర్మార్గుడు కామవాంచలు తీర్చుకున్నాడు. అలిపిరికి చెందిన వలస కూలీ తన అక్క దగ్గర కుమార్తెను ఉంచడంతో ఈ అఘాయిత్యం జరిగింది. ఎనిమిది నెలల తర్వాత వచ్చిన తల్లికి బాలిక విషయం చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.