ఆటో డ్రైవర్‌ స్మార్ట్‌ వాచ్‌లో క్యూఆర్‌ కోడ్‌, షాక్‌కు గురైన నెటిజన్‌లు

68చూసినవారు
ఆటో డ్రైవర్‌ స్మార్ట్‌ వాచ్‌లో క్యూఆర్‌ కోడ్‌, షాక్‌కు గురైన నెటిజన్‌లు
ప్రస్తుతం ఎక్కడ చూసిన పేమెంట్స్ డిజిటల్ రూపంలో నడుస్తున్నాయి. ప్రతి షాపులోనూ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు ఉండటం సాధారణమైపోయింది. తాజాగా బెంగళూరులో ఆటో ఎక్కిన ఓ వ్యక్తి పేమెంట్ కోసం డ్రైవర్‌ని క్యూఆర్ కోడ్ అడిగాడు. వెంటనే ఆ డ్రైవర్ తన స్మార్ట్‌వాచ్‌లో ఉన్న కోడ్‌ని చూపించాడు. దీంతో షాక్ అయిన కస్టమర్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ కాస్తా ప్రస్తుతం వైరల్ అవడంతో నెటిజన్‌లు షాక్‌కు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్