ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్, కోస్తా ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనమే దీనికి కారణంగా పేర్కొంది. ఇది దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణశాఖ వివరించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయని తెలిపింది.