సొంత జిల్లాలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ పార్టీ పని తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. నాయకుల మధ్య అనైక్యతను ఆయన సూటిగా ప్రశ్నించినట్లు చెబుతున్నారు, వైసీపీకి కీలకమైన కడప జిల్లాలోనే ఈ రకమైన రాజకీయం ఏమిటి అన్నట్లుగా ఆయన నేతలకు క్లాస్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే బలమైన కడపలో వైసీపీ ఎందుకు డీలా పడింది అన్నది జగన్ ఆరా తీస్తున్నారని సమాచారం.