ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఛైర్మన్ పూనూరు గౌతంరెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిందనే చెప్పాలి. విజయవాడలో కలకలం రేపిన సుపారీ గ్యాంగ్ తో హత్యాయత్నం కేసులో ప్రధాన సూత్రధారి ఈయనే అని పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. విజయవాడలో ఓ స్థలాన్ని కబ్జా చేసి యజమానిని చంపేందుకు ఓ ముఠాతో రూ.25 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించి నలుగురుని అరెస్ట్ చేసిన పోలీసులు గౌతంరెడ్డితో పాటు మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.