ఏపీలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే స్నానం చేయడానికి నదిలో దిగిన ఓ భక్తుడు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దాంతో కుటుంబ సభ్యులు నది ఒడ్డున బోరున విలిపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.