గుజరాత్ పోర్ బందర్లో సముద్ర మార్గంలో అక్రమంగా తరలిస్తున్న 500 కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా ఆపరేషన్ జరిపి ఈ డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. ఇరాన్ దేశానికి చెందిన బోటులో డ్రగ్స్ తెచ్చినట్టు అధికారులు గుర్తించారు. సరిహద్దు జలాల్లో నేవీ సాయంతో నడిసంద్రంలో ఈ ఆపరేషన్ చేపట్టారు.