ప్రధానమంత్రి మోదీ ప్రయాణించే విమానంలో శుక్రవారం సాంకేతిక సమస్య ఏర్పడింది. దీని కారణంగా విమానం బిహార్లోని డియోఘర్ విమానాశ్రయంలోనే కొద్ది సేపు ఆగిపోవాల్సి వచ్చింది, దీని వలన ప్రధానికి ఢిల్లీకి తిరిగి రావడం ఆలస్యమైంది. కాగా, మోదీ ఇవాళ ఉదయం జాతీయ గిరిజన దినోత్సవ వేడుకల నిమిత్తం బిహార్ వెళ్లారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆదివాసీ మహిళకు తాము రాష్ట్రపతి పదవిని ఇచ్చి గౌరవించామని ప్రధాని అన్నారు.