వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదని డీఎస్పీ మురళికృష్ణ వెల్లడించారు. తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాచారం ఇవ్వడం లేదన్నారు. ఆయన వాడిన మొబైల్ సిమ్ కార్డు ఇచ్చేందుకు అంగీకరించలేదని చెప్పారు. పదేపదే హైకోర్టు ఉత్తర్వులను మాత్రమే చూపిస్తున్నారని తెలిపారు. మరోసారి ఆయన్ను విచారణకు పిలుస్తామని అన్నారు. చంద్రబాబు నివాసంపై దాడికి వెళ్లిన ఘటనలో జోగి రమేష్‌ను పోలీసులు ప్రశ్నించారు.