AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మంగళవారం నుంచి 4 రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి పులివెందుల చేరుకుంటారు. 25న సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరవుతారు. 26న పులివెందుల క్యాంపు ఆఫీస్‌లో ప్రజాదర్బార్, 27న పులివెందుల విజయ గార్డెన్స్‌లో ఓ వివాహానికి హాజరవుతారు. అనంతరం బెంగళూరుకు పయనమవుతారు.