రిమ్స్ ఆసుపత్రిలో....‌వైన్ షాపులో కాదు

1269చూసినవారు
రిమ్స్ ఆసుపత్రిలో....‌వైన్ షాపులో కాదు
ఔను. మీరు చూస్తున్న దృశ్యం ఏ వైన్ షాపులోదో లేక బార్ లోదో కాదు. ప్రతిరోజు వందల మంది చికిత్స కోసం వచ్చే ప్రభుత్వ దవాఖానాలోనిదే ఈ దృశ్యం. వివరాల్లోకి వెళితే మహానేత దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్. రాజశేఖర్ రెడ్డి జిల్లా ప్రజలకు అత్యాధునిక మెరుగైన వైద్యం అందించేందుకు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పేరుతో అప్పటి సమైక్య రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలలను అనుబంధంగా ఐదు ఆసుపత్రులను కోట్ల రూపాయల వ్యయంతో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఏర్పాటు చేయడం జరిగింది.

అందులో ఒకటి కడపలో ఏర్పాటు చేసిన రిమ్స్ వైద్యశాల, తర్వాత వచ్చిన ప్రభుత్వం దీనిని ప్రభుత్వ సర్వజనిక్ ఆసుపత్రిగా పేరు మార్చడం జరిగింది. అటువంటి ఆసుపత్రిలో వందల సంఖ్యలో అటు అధికారులు ఇటు సిబ్బందిచే పర్యవేక్షణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మద్యం బాటిళ్లతో కనిపిస్తున్న దృశ్యాలు చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ పరిస్థితిని చూసి ఇక్కడి సిబ్బంది, అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.

ట్యాగ్స్ :