ఏపీ ఎన్నికల హింస ఘటనల్లో బదిలీ అయిన వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టారు. ఐదుగురు డీఎస్పీలు, ఏడుగురు ఇన్‌స్పెక్టర్లుగా నియమిస్తూ సీఈఓ ముకేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. నరసరావుపేట డీఎస్పీగా ఎం.సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా సీహెచ్ శ్రీనివాసరావు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయుడు, తిరుపతి స్పెషల్ బ్రాంచ్‌కు ఎం.వెంకటాద్రిని నియమిస్తూ సీఈఓ ఉత్తర్వులు జారీ చేసింది.