రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మూల పల్లె గ్రామపంచాయతీ పెన్నా నది ఒడ్డున వెలసియున్న అయ్యవా రెడ్డి స్వామి పూజలు మంగళవారం ఘనంగా జరిగాయి. స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వచ్చిన భక్తులకు ఆవాల బియ్యం ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఆలయ కమిటీ ద్వారా అన్నప్రసాదాలు వచ్చిన భక్తులకు సమకూర్చారు.