సంబేపల్లి: చేపల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవపట్ల గ్రామం సుగాలి బీడీకి వద్ద సోమవారం సాయంత్రం చిత్తూరు నుంచి చేపల లోడుతో కడుపకు వెళుతున్న బులేరో వాహనం టైరు పంచరై బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డారు. సంఘటన స్థలానికి సంబేపల్లి పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.