కాకినాడ నగర పాలక సంస్థ పరిధిలో గల క్లాప్ వాహనాల నడిపించాలని, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని శుక్రవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో క్లాప్ వాహన డ్రైవర్స్ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్లాప్ వాహనాలు ప్రతి నిత్యం నగరంలో తడిచెత్త పొడిచెత్త సేకరణలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి అందరికి తెలిసిందే అన్నారు. వారికి సకాలంలో జీతాలు చెల్లించాలని పేర్కొన్నారు.