వైసీపీకి వరస షాక్‌లు తగులుతున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సైతం వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్ తీసుకున్నారని సమాచారం.