
అవినాశ్ బెయిల్‌పై ఉండటం వల్లే సునీతకు న్యాయం జరగట్లేదు: షర్మిల
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితుడు అవినాశ్‌రెడ్డి బెయిల్‌పై వచ్చి.. సాక్షులను బెదిరిస్తున్నారని షర్మిల ఆరోపించారు. "వివేకా కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారు. సునీతకు ఇద్దరు పిల్లలున్నారు.. ఆమె ప్రాణాలకు రక్షణలేదు. వివేకా హత్య కేసు నిందితులు సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది" అని ఆందోళన వ్యక్తం చేశారు.