ప్రియుడిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసిన మహిళ

71చూసినవారు
ప్రియుడిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసిన మహిళ
ఒడిశాలోని భువనేశ్వరలో షాకింగ్ ఘటన జరిగింది. సోమనాథ్ (28), ప్రాప్తి శర్మ(23) గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే ప్రాప్తికి మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో సోమనాథ్ గొడవ పడి ప్రాప్తిని కొట్టాడు. దీంతో సదరు యువతి ఈ విషయాన్ని తన అక్కకు చెప్పింది. అక్క తన ప్రియుడి ఆకాశ్‌కు చెప్పగా మరో వ్యక్తితో కలిసి సోమనాథ్‌ను కిడ్నాప్ చేశారు. అనంతరం సోమనాథ్ అక్కకు ఫోన్ చేసి రూ.10 లక్షల డిమాండ్ చేశారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

సంబంధిత పోస్ట్