
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై APPSC క్లారిటీ
AP: ఫిబ్రవరి 23న జరగబోయే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై APPSC క్లారిటీ ఇచ్చింది. ఈ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. ఉ.10 నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మ.3 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 జరుగుతుందని పేర్కొంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది.