ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇవాళ అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందాలు చేసుకున్నారు. అమరావతిలో అంతర్జాతీయ డీప్‌టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సాంకేతిక సలహా కోసం ఏపీసీఆర్‌డీఏ ఒప్పందం చేసుకుంది. విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్‌వేగా అభివృద్ధి చేసేలా ఐఐటీఎం ఒప్పందం చేసుకుంది.