అమలాపురంలో మంగళవారం జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలో గందరగోళం ఏర్పడింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్న ఉండగానే జనసేన నేతలు నిరసన తెలిపారు. జనసేన నేతలను స్టేజీపైకి ఎందుకు పిలవలేదంటూ వారు నిలదీశారు. సభా వేదికపై టీడీపీ నేతలు ఎక్కువ మంది కూర్చున్నారు. దీంతో జనసేన, బీజేపీ నాయకులకు కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడంతో వారు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు సర్దిచెప్పడంతో వారు శాంతించారు.