కాట్రేనికోన: విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన
కాట్రేనికోన పీహెచ్సి వైద్యాధికారి లిఖిత ఆధ్వర్యంలో సిద్ధార్థ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అందరికీ క్యాన్సర్ పరీక్షలు అనే అంశంపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అందరూ ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు. అనంతరం కళాశాల నుంచి గేటు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. సీహెచ్ శ్రీహరి, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.