కాట్రేనికోన మండల ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం ఏకగ్రీవంగా జరిగింది. గౌరవ అధ్యక్షులుగా మీరా మహమ్మద్, అధ్యక్షులుగా బొమ్మిడి ధర్మారావు, ప్రధాన కార్య దర్శిగా ఎస్కే మక్బూల్, ట్రెజరర్ గా సురేష్ బాబు ఎన్నికయ్యారు. కోనసీమకు చెందిన ప్రముఖులు నిమ్మకాయల లక్ష్మణరావు, కంబాల బాబురావు, ఎండీ రఫీ, దొమ్మేటి వెంకటేశ్వరరావు, ఎరుబండి త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది.