పెనుగొండ సీఐ విజయ్ కుమార్తో తనకు ప్రాణ హాని ఉందని మాజీ కార్పొరేటర్, కార్మిక నేత వాసంశెట్టి గంగాధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘నన్ను హత్య చేయటానికి పెనుగొండ సీఐ కిరాయి హంతకులతో ఓ గ్యాంగ్ ఏర్పాటు చేశారని ఇదే విషయమై రాజమండ్రి త్రీ టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇదే నా మరణ వాంగ్మూలం అని ఆయన తెలిపారు.