రామచంద్రపురం మండలం ఆదివరపు పేట గ్రామంలో చేనేత సంఘ కార్మికులు ఏర్పాటు చేసిన క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన చేనేత పరికరాలను అర్హులైన లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ చేనేత కార్మికులకు తాను ఎంతో రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.