రాజోలు మండలం శివకోడు మంగిన గంగయ్య కాపు కళ్యాణ మండపంలో బుధవారం దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ ప్రత్యేక శిబిరం జరుగుతుందని మామిడికుదురు మండలం పాశర్లపూడిలంకలో మంగళవారం మైకు ద్వారా విస్తృతంగా ప్రచారం చేయించారు. సర్పంచ్ తెలగారెడ్డి సూర్య ప్రకాశరావు ఆధ్వర్యంలో ప్రచారం వహించారు. దివ్యాంగులకు ఉపకరణాలు అందించేందుకు శిబిరం ఏర్పాటు చేశారన్నారు. అర్హత కలిగిన వారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.