AP: ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీతో పాటు కొందరు కుట్రలు, కుతంత్రాలు చేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. విజయసాయిరెడ్డిపై కక్ష సాధింపులకు పాల్పడినా ఆయన చలించకుండా ఎదుర్కున్నారని కాకాణి తెలిపారు. విజయసాయిరెడ్డి విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుని స్పందిస్తామన్నారు. ఆయన నిజంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆలోచించి ఉంటే.. కొనసాగాలని కోరుతామని కాకాణి తెలిపారు.