PAMY కింద 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలి: సీఎం రేవంత్

63చూసినవారు
తెలంగాణ పట్టణాభివృద్ధి, విద్యుత్‌ శాఖలపై సీఎం రేవంత్‌ శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఐటీసీ కాకతీయ హోటల్‌లో కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, సీఎం రేవంత్‌ భేటీ అయ్యారు. పీఏఎంవై కింద 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ఖట్టర్‌ ను సీఎం కోరారు. మెట్రో రెండోదశ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్రాలు జాయింట్‌ వెంచర్‌గా చేపట్టాలని చర్చించారు. ఈ మీటింగ్ కి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, ఎంపీ ఈటల హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్