పాముతో యువతి ఇన్‌స్టా రీల్.. కాటు వేసింది (వీడియో)

57చూసినవారు
పాముతో రీల్ చేస్తుండగా ఓ యువతికి ఊహించని షాక్ తగిలింది. రష్యాకు చెందిన డ్యాన్సర్ ష్కోడలేరా తన చేతిలో భారీ పామును పట్టుకుని వీడియో తీయించుకుంటోంది. ఎవరితోనో ఆమె మాట్లాడుతుండగా ఒక్కసారిగా చేతిలోని పాము దాడి చేసింది. ఆమె ముక్కుపై కరిచింది. తన ముక్కును పట్టుకుని నొప్పితో విలవిలలాడింది. భయంతో కేకలు వేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్