
కోడూరు: అగ్ని బాధిత కుటుంబానికి చేయూత
అగ్ని బాధిత కుటుంబానికి రూ. 66 వేల ఆర్థిక సహాయాన్ని అందించి నక్క వాణి దారి గ్రామానికి చెందిన యువత దాతృత్వాన్ని చాటి పలువురుకు ఆదర్శంగా నిలిచారు. కోడూరు మండల పరిధిలోని నక్క వాని దారి గ్రామంలో శవిద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి సర్వస్వం కోల్పోయిన పచ్చా వీరబాబు కుటుంబానికి నక్క వానిదారి గ్రామ యువత శనివారం రూ. 66 వేలు సహాయం అందించి అండగా నిలిచారు.