Sep 25, 2024, 01:09 IST/
యూట్యూబర్ హర్షసాయి బాధితురాలికి వైద్య పరీక్షలు
Sep 25, 2024, 01:09 IST
బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని, తనపై హర్షసాయి హత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి ఫిర్యాదులో పేర్కొంది. వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఆమెను మంగళవారం రాత్రి కొండాపూర్ లోని రంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకువచ్చి పరీక్షలు జరిపించారు. అనంతరం ఆమెను సఖి కేంద్రానికి తరలించారు.