జి. కోడూరు: ఇసుక కోసం వచ్చిన వారిపై దాడి
జి. కోడూరు: ఇసుక మాఫియా రోజురోజుకు రెచ్చిపోతోంది. జి. కొండూరు మండలం, వెల్లటూరు శివారు సీతారాంపురం గ్రామంలో సోమవారం జరిగిన దాడి ఈ మాఫియా ఆగడాలకు నిదర్శనం. టీడీపీ సానుభూతిపరుడు ఆకుల రామారావు తన ఇంటి ప్రహరీ నిర్మాణానికి ఇసుక తీసుకురావడానికి ప్రయత్నిస్తుండగా, టీడీపీ నాయకుడు మొండితోక గోపాలరావు అనుచరులతో కలిసి దాడి చేశారని గ్రామస్తులు తెలిపారు.