కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఎంవిఐ యాక్ట్ రవాణారంగ కార్మికులకు ఉరితాడు కానుందని సీఐటీయూ పశ్చిమ కృష్ణాజిల్లా కార్యదర్శి ఎన్ సిహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు. మండల కేంద్రమైన జి.కొండూరు గ్రామంలోని సీఐటీయూ కార్యాలయంలో శనివారం మండల మహాసభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సభలో శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే ఎంవిఐ చట్టంలో నిబంధనలు డ్రైవర్లకు పెద్దసమస్యగా మారతాయన్నారు. పార్లమెంటులో ఈ చట్టాన్ని మంత్రివర్గం ఆమోదిస్తే రవాణారంగ కార్మికులందరూ పోలీస్ స్టేషన్ లలో, జైళ్లలో ఉండాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.