‘పాలు తాగే బాబు ఉన్నాడు.. వదిలేయండంటూ మహిళ ఆవేదన’

59చూసినవారు
TG: సచివాలయం వద్ద నిరసనకు దిగిన బెటాలియన్ పోలీసుల కుటుంబీకులను పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని వ్యాన్ ఎక్కించారు. దీంతో ఆమె 'నాకు పాలు తాగే చిన్న బాబు ఉన్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దయచేసి నన్ను వదిలేయండి అంటూ వేడుకున్నారు. అక్కడున్న మీడియా సిబ్బంది కూడా ఆమెను వదిలేయాలని కోరినప్పటికీ పోలీసులు వ్యాన్‌లో తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్