Dec 23, 2024, 17:12 IST/
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.. స్పందించిన కేంద్ర మంత్రి
Dec 23, 2024, 17:12 IST
తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన తెలుగు విద్యార్థి వంశీ అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.. వంశీ పార్థివదేహాన్ని స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కార్యాలయానికి ఆయన మెయిల్ ద్వారా లేఖ రాశారు. సోమవారం బండి సంజయ్ వంశీ తండ్రి బండి రాజయ్య, సోదరుడు సుమన్‌తో మాట్లాడారు.