ఉత్తమ పోలీస్ అధికారిగా గజపతి రావు

80చూసినవారు
ఉత్తమ పోలీస్ అధికారిగా గజపతి రావు
చాట్రాయి పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎన్ గజపతిరావుకు శుక్రవారం ఉత్తమ పురస్కారం లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయనకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ మేరీ ప్రశాంతి సమక్షంలో ప్రశంసా పత్రాన్ని అందజేశారు. వివాద రహితుడైన గజపతిరావు నీతి నిజాయితీకి మారుపేరుగా విధులు నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్