ఇళ్ల స్థలాల సాధన కోసం సీపీఐ చేపట్టిన కార్యక్రమానికి ఇళ్లు లేని పేద వర్గాలు కలిసి రావాలని సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక హనుమాన్‌పేట దాసరి భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణల్లో 2సెంట్లు, గ్రామల్లో 3సెంట్లు స్థలం, ఇంట నిర్మాణానికి రూ. 4లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.