కొందరు నన్ను కావాలనే ఇరికించారు: జానీ మాస్టర్
లేడీ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్‌ను పోలీసులు శుక్రవారం ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై తొలిసారిగా స్పందించిన జానీ మాస్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఆమెపై ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఆమెతో ఫిర్యాదు చేయించి, తనను ఈ కేసులో ఇరికించారన్నారు. దీనిపై లీగల్‌గా పోరాడుతానని స్పష్టం చేశారు. కోర్టులో హాజరుపర్చడానికి ముందు జానీ మాస్టర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు.