పంటి నొప్పితో బాధపడేవారికి ఉప్పునీటితో ఉపశమనం

61చూసినవారు
పంటి నొప్పితో బాధపడేవారికి ఉప్పునీటితో ఉపశమనం
పంటినొప్పితో చాలా మంది బాధపడుతుంటారు. కొన్నిసార్లు ఈ నొప్పి బాగా పెరిగి చిగుళ్లు వాపు వస్తాయి. తీపి పదార్థాలు తినేవారిలో పంటి నొప్పి ఎక్కువగా వస్తుంది. అయితే పంటి నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం పొందేందుకు ఈ చిట్కాను పాటించండి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి మిక్స్ చేయాలి. ఆ వాటర్‌ను నోట్లో పోసుకొని తాగకుండా పుక్కిలించాలి. ఉప్పునీటితో పుక్కిలించడం వల్ల నోటిలో ఉన్న పదార్థాలు బయటకు వచ్చి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

సంబంధిత పోస్ట్