Nov 29, 2024, 16:11 IST/
TG: పెద్దపులి సంచారం.. 144 సెక్షన్ విధింపు
Nov 29, 2024, 16:11 IST
తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ఈసాగామ్, నజరుల్నగర్, సీతానగర్, అనుకోడా, గన్నారం, కడంబా, ఆరెగూడ, బాబూనగర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరించడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా గ్రామాల్లో 144 సెక్షన్ విధించింది. ప్రజలు పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.