కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్టులో యురేనియం తవ్వకాలు ఆపే శక్తి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం కప్పట్రాళ్ళలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించి, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే యురేనియం తవ్వకాలు స్థానిక నాయకులకు ఎలాంటి సంబంధం లేదని, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే దీన్ని ఆపగలరని అన్నారు.