పాణ్యం: స్వార్థపూరితంగా బాణాసంచా కాల్చరాదు: ఎస్సై
గడివేముల మండల ప్రజలు దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఎస్సై నాగార్జున రెడ్డి తెలిపారు. గురువారం గడివేములలో మీడియాతో మాట్లాడారు. దీపావళి వేళ బాణాసంచాను స్వార్థపూరితంగా వ్యక్తులపైకా, ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుల ఇళ్ళ ముందు కానీ కాల్చరాదని, డీజేలు నిర్వహించరాదని అన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రమాదాలు జరిగిన వెంటనే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలన్నారు.