ఆహార ప్యాకెట్లు అందించిన ఎస్పీ ,ఎమ్మెల్యే

891చూసినవారు
ఆహార ప్యాకెట్లు అందించిన  ఎస్పీ ,ఎమ్మెల్యే
కరోనా వైరస్ , లాక్ డౌన్ కారణంగా ప్రతి నిత్యం కర్నూల్ పోలీసులు విధులు నిర్వహిస్తున్న నేపధ్యంలో మంగళవారం కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న బాలాజీ హోటల్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో పోలీసులకు, నిరాశ్రయులకు కర్నూలు జిల్లా ఎస్.పి డాక్టర్. పక్కిరప్ప మరియు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూల్ రెడ్డి ఆహార ప్యాకేట్స్, మంచి నీళ్ల ను అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్.పి మాట్లాడుతూ... కోవిడ్ - 19 ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రజలను బయటకు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అందరూ సహాయం చేయుటకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పోలీసులకు పూర్తిస్థాయిలో సహకారాన్ని అందించాలని ప్రజలను కోరారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ... పాణ్యం నియోజకవర్గ పరిధిలోని పాణ్యం, గడివేముల, నన్నూరు ప్రాంతాల నుండి సుమారు 11 మంది కొన్ని రోజుల క్రితం జమాత్ ప్రార్థన కు వెళ్లివచ్చారనే సమాచారం మేరకు11 మంది ని కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు.ఎవ్వరు బయటకు రావద్దని ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని అత్యవసర పరిస్థితుల్లో మన తోటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని అలాగే పట్టణ ప్రాంతాల నుండే ఎక్కువగా పాజిటివ్ కేసులు వస్తున్నాయని తెలిపారు. ధైర్యంగా పోరాడి వైరస్ ను అంతం చేద్దాం అని పిలుపు నిచ్చారు.

సంబంధిత పోస్ట్