గూడూరు: హత్య కేసులో నిందితుడి అరెస్టు
గూడూరు పట్టణానికి చెందిన బోయరవి హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేశామని సీఐ తబ్రేజ్ తెలిపారు. మంగళవారం గూడూరులో ఆయన మాట్లాడారు. గతనెల 22న గూడూరులోని కల్లందొడ్డిలో బోయ రవిని గూడూరుకు చెందిన అలెగ్జాండర్ హత్య చేసినట్లు గుర్తించామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. కేసులో ప్రతిభ కనబరిచిన ఎస్సైలు తిమ్మయ్య, మధుసూదనరెడ్డి, కానిస్టేబుళ్లకు రివార్డును ఇచ్చినట్లు తెలిపారు.